ప్రతిష్టాత్మకమైన ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అవార్డ్ కు ఎంపికైంది ఖులానా బారిక్. ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్‌ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో హెడ్ నర్స్ గైనకాలజీ వార్డ్ లో ఇంచార్జ్ గా విధులు నిర్వహిస్తోంది. కోవిడ్ సమయంలో కోవిడ్ సోకిన గర్భిణీలకు సుఖ ప్రసవం అయ్యేలా నవజాత శిశువులు ఆరోగ్యంగా ఉండేలా ఎంతో కృషి చేసింది ఖులానా బారిక్. ఆమె సేవలకు గాను ఒరిస్సా ప్రభుత్వం కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్ గా గౌరవించింది. కోవిడ్ సమయంలో ఒక్క రోజు కూడా సెలవు పెట్టలేదు. ఆమె ప్రాణాల కంటే ఉద్యోగం ధర్మం మేలు అనుకున్న ఖులానా కు ప్రభుత్వం అందించిన ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్ ఆమెకు అందిన గౌరవానికి ఆమె సేవకు నిదర్శనం.

Leave a comment