సరైన పోశ్చర్ లో నిల్చోవడం,కూర్చోవడం చెయ్యకపోతే అది వెన్నుకు మాత్రమే అపకారం చేయడంతో ఆగక శృంగార జీవితం పై ఎఫెక్ట్ చూపిస్తుందని చెబుతున్నారు యూకె నిపుణులు. ఇలా ఒంపుగా,నిర్లక్ష్యంగా కూర్చునేవాళ్ళు ప్రతికూల పదాలను యదేశ్చగా వాడేస్తుంటారట. మంచి పోశ్చర్ లో కూర్చోకపోతే నిలబడకపోయినా వెన్ను సహజమైన ఒంపుకు మెయింటైన్ చేయగల శారీరక అలైన్ మెంట్ లేకపోతే శ్వాసలోకూడా తేడా వస్తుందంటున్నారు. శరీరం ఒత్తిడికి గురవుతుంది. ఆపైన మానసిక ఒత్తిడికి నిద్రాభంగం శక్తి సన్నగిల్లడం తప్పదు.శృంగారం పట్ల కూడా ఆసక్తిపోయే ప్రమాదం ఉందంటున్నారు. కొద్దిపాటి వంకరగా కూర్చోన్న చాలా కొద్ది కాలంలో నడకలో,కూర్చోవడంలో వంగిపోవడం తెలుస్తుందంటున్నారు.

Leave a comment