బీహార్ లోనే ముజాఫ్ఫార్ పూర్ రైల్వే స్టేషన్లో శ్రామిక రైల్లోంచి. అర్బీనా ఖాతున్ అన్న యువతి శవాన్ని దించారు ఆమె కొడుకు రెండేళ్ల వాడు తల్లికి కప్పిన దుప్పటి తీస్తూ ఆమె లేవమని అడుగుతూ ఆడుతున్న దృశ్యాన్ని వీడియో ద్వారా ప్రపంచం మొత్తం చూశారు. భర్త వదిలేసిన అర్బీనా బీహార్ నుంచి గుజరాత్ వలస వెళ్లి పిల్లవాడితో బ్రతుకుతుంది.లాక్‌డౌన్‌ లో శ్రామిక రైల్లో తన స్వస్థలం కటిహార్ కు బయలుదేరి దారిలో చనిపోయింది.ఆమె కొడుకును వీడియోలో చూసి షారుక్ ఖాన్ స్పందించారు.తన ఆధ్వర్యంలో నడిచే మీర్  ఫౌండేషన్ ఆ పిల్లవాడి దత్తత తీసుకుంటుందని వెల్లడించారు తల్లి లేని పసివాడికి షారుక్ ఆసరా  ఇచ్చారు .

Leave a comment