ఆగస్ట్ 2018 ఓగ్ కవర్ పేజీపైన షారూక్ ఖాన్ ,గౌరీఖాన్ ల గారాల బిడ్డ సుహానాఖాన్ అందంగా కనిపించింది. ఓగ్ మ్యాగజైన్ కోసం ఫస్ట్ ఫోటో షూట్ జరిగినందుకు షారూక్ అంతులేని ఆనందం వ్యక్తం చేస్తూ ఓగ్ కు థ్యాంక్స్ చెబుతూ ట్విట్టర్ లో తన పితృప్రేమను వ్యక్తం చేశాడు. గౌరీఖాన్ కూడా ఎంతో ఆనందపడి ,డిజైనర్ అనితా అడ్జానియ డిజైన్ చేసిన అందమైన డ్రెస్ లతో సుహానాఖాన్ ఫోటోలు ట్విట్టర్ లో పోస్టు చేసిందట. మొత్తానికి షారూక్ గారమ్మాయి వెండి తెర పైకి రంగప్రవేశం చేయనున్నదని సినీ ప్రముఖుల ఆనందపడ్డారు.

Leave a comment