నీరసంగా అనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు పరుగెత్తుకొనక్కరాలేదు. శరీరం విశ్రాంతి కోరుకుంటుందని అర్ధం చేసుకోమంటున్నారు ఎక్స్ పర్ట్స్. అతిగా శ్రమ పడటం, గంటల కొద్దీ వ్యాయామం చేయడం, ఇంటి పని, ఆఫీస్ పనీ రెండు చేతులతో చేయాలని మొదలు పెట్టడం ఇవన్నీ శరీరాన్ని కుంగ దీసేవే ఏదయినా అతిగా చేస్తే అనారోగ్యమే సైకిలింగ్, ఈత నడక వంటి వ్యాయామాలు చేస్తుంటే కాస్త కష్టంగా అనిపిస్తే ఆ సమయంలో కాసేపు ఆపేసి విశ్రాంతి తీసుకోవాలి. వారంలో ఏడు గంటల కన్నా ఎక్కువ ఎక్కువ సమయం వ్యాయామం చేస్తే ఆందోళన వత్తిడి సహజం అని యొక అద్యాయినం రిపోర్టు స్పష్టంగా చెప్పుతుంది. బరువు లెత్తడం మంచి వ్యాయామమె కానీ అతిగా బరువులు ఎత్తుతుంటే కీళ్ళ నొప్పులు ఖాయం అంటున్నారు వైద్యులు. శక్తికి మించి వ్యాయామాలు ఇతర పనులు పెట్టుకోకండిశరీరం అలసిపోతుంది అంటున్నారు.

Leave a comment