మార్కెట్ లో ఎన్నోరకాల షాంపులు కనిపిస్తాయి. శిరోజాల రకాల్ని బట్టి షాంపూలు ఎంచుకోవాలి. పలుచని జుట్టు ఉంటే అందుకు తగినట్లు ఎంచుకోవాలి. బిరుసైన జుట్టు ఉంటే దానికి తగిన షాంపూ ఎంచుకోవాలి.షాంపులపై లేబుల్స్ ఉండాలి. కాంబినేషన్స్ చూసుకోని ఎంచుకోవాలి. అలాగే షాంపూల వల్ల జుట్టు పొడి బారకుండా కొన్ని గృహ చికిత్సలు పాటించాలి. పుల్లటి పెరుగు తలకు పట్టించి ఓ అరగంట పోయాక స్నానం చేయాలి లేదా పెరుగులో రాత్రిపూట మెంతులు వేసి నాననిచ్చి ఉదయాన్నే రుబ్బి తలకు పట్టించి ఓ అరగంట పోయాక కడిగేయాలి. వారానికి ఒక సారి అలావేరా గుజ్జుతో బాధం నూనె కలిపి తలకు మాస్క్ వేసుకొని అరగంట తర్వాత కడిగేయాలి. అప్పుడప్పుడు నీట్ గా ట్రిమ్ చేయాలి

Leave a comment