మన దగ్గర పవర్ ఉందనుకో దేవుడు మనకి ఆ తర్వాత పవర్ ఉండే పొజిషన్ ఇచ్చినట్లే.మన ద్వారా ఎంతో మందికి మంచి చేయాలన్నది ఆయన అభిమతం కావచ్చు. ఆపదలు ఉన్న వారిని ఆదుకోవటంలోనే మన దగ్గర ఉన్న పవర్ కు సరైన అర్ధం చెప్పినట్లు అంటుంది అనుష్కశర్మ. సక్సెస్,డబ్బు,ఫేమ్,పవర్ ఇవన్ని మన కష్టంతో వచ్చేవే. అందులో మిగిలిన వన్ని మన కోసం ఏమో కాని పవర్ మాత్రం కచ్చితంగా పనులకు ఉపయోగించటం కోసమే అంటుంది అనుష్క శర్మ.నా పొజిషన్ నా కున్న కాస్త ఇన్ ఫ్లుయన్స్ తో ఒక యానిమల్ షెల్టర్ స్టార్ట్ చేశాను. అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఇలాంటి పనుల కోసం నేను ఎంతైన కష్టపడగలను అంటుంది అనుష్క శర్మ.

Leave a comment