శరీరంలోని వ్యర్ధాలు పోతేనే చర్మం మృదువుగా మెరుపుతో వుంటుంది. అలా ఉండాలంటే ఆహార వ్యవహారాల్లో కొన్ని మార్పులు చాలా అవసరం. ఉదయం లేస్తూనే కాఫీ కాకుండా గోరువెచ్చని నీటిలో నిమ్మరసం తేనె కలిపి తాగితే మంచిది. తేలికగా అరిగేందుకు ఉడకబెట్టిన కూరలు కుడా మంచివే. రోజుకు రెండు మూడు సార్లు గ్రీన్ టీ తాగితే అందులోని పాత్ ఫేనాల్సే శక్తివంతమైన  యాంటాక్సీడెంట్స్ గా పనిచేస్తాయి శరీరంలోని మలినాలు బయటికి పోయేందుకు పోషక విలువలను శరీరంలోని కణాలకు అందేందుకుమంచి నీళ్ళు బాగా తాగాలి. తీసుకునే ఆహారంలో విటమిన్లు, ఖనిజలవణాలతో పాటు ప్రో, ప్రీ బియోటిక్స్ కుడా అందేలా వుండాలి. పళ్ళు కూరగాయలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఆహారం, వ్యాయామం తో పాటు శరీరం డిటాక్సిఫై అయితేనే చర్మం మెరుపులతో వుంటుంది.

Leave a comment