వేసవి వచ్చేసింది . కాలు బయటపెడితే ఎండా వేడి చెమట . శరీరం ఫ్రెష్ గా వుందనిపించదు. అలాంటప్పుడు శరీరం సువాసనలతో ఉండాలంటే స్నానం చేసే నీళ్లల్లో ఒక నిమ్మకాయ రసం పిండాలి. దీని వల్ల  శరీరం తాజాగా ఉంటుంది. టీ ట్రీ ఆయిల్ పుదీనా ఆకులు కూడా మంచి ప్రత్యామ్నాయాలు. ఎక్కువ స్పైసి పదార్ధాలు తినకూడదు. నీరు బాగా తాగాలి. దీని వల్ల శరీరం నుండి టాక్సిన్లు విడుదలై శారీరిక దుర్వాసనలు ఉండవు. యాంటీ పరిస్పిరెంట్ ప్రభావం రోజంతా ఉండి  ఏ విధమైన తెల్లని మచ్చలు రాకుండా చర్మం తాజాగా ఉంటుంది . ఫ్రూట్ స్ప్రే వల్ల  పాదాల దుర్వాసన రాదు. పైగా హాఫ్ షూ వేసుకునేవారికి ఇది అవసరం కూడా. అన్నిటి కంటే ముఖ్యం రెండు పూటలా స్నానం చేయటం. అలాగే టీవీ ల్లో ఎన్నో డెమోలు చూస్తూ ఉంటాం. చర్మం చెమటలు పొడిగా ఉంటుందనీ దుర్వాసన రాదనీ అంటారు. కానీ ప్రతి బ్రాండ్ లోను టీ  ట్రీ ఆయిల్ నుండి బేకింగ్ సోడా అలోవెరా వంటివే ఉంటాయి . ఎసెన్షియల్ ఆయిల్స్ హెర్బ్స్ తో ఆహ్లాదకరమైన పరిమళాలు ఉంటాయి. కానీ వాటంతట అవి సేద్యం తగ్గించలేవు. మంచి సువాసన ఎంచుకోవటమే.

Leave a comment