ఏ సినిమాలోనో, ఏ మాగజైన్ కవర్ పేజీపైనో చూసి, ఒక సినీ యాక్టర్ వేసుకొన్న డ్రెస్సునో, ఏ మోడల్ ధరించిన నాగనో చూసి మోజు పడతారు. కానీ అందరికి ఒకే రకమైన శరీరాకృతి వుండదు. ఒకళ్ళకు నప్పినట్లు ఇంకొక్కళ్ళకు బావుండవు. శరీరపు రంగు, ఎత్తు, బరువు ఎన్నో తేడా లేకుండా ఉంటాయి. అందుకే ఎవరికి నప్పే దుస్తులు వాళ్ళు ఎంపిక చేసుకోవాలి. సన్నగా పొడుగ్గా వుంటే అన్ని రకాల వస్త్ర శ్రేణి నప్పుతుంది. ఇవి సాదాగా వుంటే ఇంకా పొడుగ్గా కనిపిస్తాయి. పొడవాటి మాక్సిలు, పలజోలు చక్కగా నప్పుతాయి. చీరలు బావుంటాయి కానీ చీర కట్టులు, ఎంచుకునే రంగులు, మాచింగ్ గా వేసుకునే నగల్లో కొత్తగా కనిపించేలా శ్రద్ధ తీసుకోవాలి. లావుగా, పొట్టిగా వుంటే వంటికి అతుక్కు పోయే దుస్తుల్ని ఎంచుకోక పోవడం మంచిది. బొట్ నెక్ తరహ, బుజాలు విశాలంగా కనిపించేలా డిజైన్లు ఎంచుకోవాలి. విశాలమైన బుజాలకు కాలర్ నెక్, హై నెక్, బొట్ నెక్ వంటివి చాలా బావుంటాయి.

Leave a comment