బరువు తగ్గాలనుకోవటం ఒక సాధన. ఆ క్రమంలో శరీరం ఎంత శ్రమ ఓర్చుకోగలుగుతుందో గమనించుకోమంటున్నారు నిపుణులు. వ్యాయామం చేసినప్పుడు దాహం వేసిన పెదవులు తడారిపోయినా శరీర ఉష్ణోగ్రత పెరిగినా వెంటనే నీళ్లు తాగాలి. జీవక్రియల పనితీరు సరిగ్గా ఉండేలా మితంగానే వ్యాయామం చేయాలి. శరీరం అలసిపోతేనే కండరాలు కీళ్ల నొప్పులు వస్తాయి. శరీరం అతిగా అలసిపోయిందని చెప్పే సంకేతాలివి. మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకుంటూనే వ్యాయామం చేయాలి. వ్యాయామం తరువాత వెంటనే స్నానం వద్దు . అలాని ఏసీ లో కూర్చోవటం ఫ్యాన్ కింద విశ్రాంతి తీసుకోవటం తప్పు. శరీరం సరైన ఉష్ణోగ్రత లోకి వచ్చేదాకా వేచి చూసి స్నానం చేయాలి. అలాగే వ్యాయామం ముగించగానే ఆహారం తీసుకోకూడదు. అలాగే ముందు కూడా మాంసకృతులు వుండే ఆహరం జోలికి పోకుండా వుండటం ఉత్తమం.
Categories