నేనొక్కదాన్నే ఏంచేయగలను అనుకొంటాం… కానీ ఎంతో మంది ఒక్కళ్ళు గానే ఎంతో మందికి సేవ చేస్తున్నారు ఎందరో జీవితాల్లో వెలుగులు పూయిస్తున్నారు.జబ్న చౌహాన్ హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలోని కొండ ప్రాంతంలో ఉన్న ఊరిలో కాలేజీలో చదివింది. ఉద్యోగం చేస్తూ తండ్రికి సాయ పడేది. ఆమెకు ఊరివాళ్ళు సర్పంచ్ గా ఎనుకున్నారు. సర్పంచ్ అయ్యాక ఆ ఊరి బాగోగులు తనవే అనుకొంది జబ్న. ఆ వూర్లో మద్యం అమ్మకాలు నిలిపి వేయించింది ప్రతి వారం ఊరంతా కలసి ఆగ్రామం శుభ్రం చేస్తారు ఆ ఊరు ఉత్తమ స్వచ్ఛ గ్రామంగా అవార్డ్ లు తెచ్చుకొంది అందిరినీ కలుపుకొంటూ ఊరి తీరే మార్చేసిన జబ్న దేశంలోనే పిన్న వయసు సర్పంచ్.

Leave a comment