ప్రపంచాన్ని మారుస్తున్న 50 మంది మహిళల జాబితాలో వన్యప్రాణి ప్రేమికురాలు సుప్రజా ధరణి పేరు చోటు చేసుకుంది చెన్నయ్ లో నివసించే సుప్రజా ది సముద్రం తో ఎంతో అనుబంధం అక్కడ అంతరించిపోయే దశలో ఉన్న రిడ్లే తాబేళ్లను కళ్లతో చూసింది గాయాలు పాలైన తాబేళ్లను వాటి గుడ్ల కోసం చంపేసే వాళ్లను గమనించింది గుడ్లు పెట్టేందుకు సముద్రంలో ఎంతో దూరం ప్రయాణం చేసి ఒడ్డుకు వచ్చి గుడ్లు పెట్టే ఈ తాబేలు రక్షణ భారం తీసుకొంది సుప్రజా ధరణి. తమిళనాడు, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ లోని యువకులను ఒక్కటి చేసి సముద్ర తాబేళ్ల రక్షణ దళాలని ఏర్పాటు చేసింది. 368 సభ్యులు ఉన్న ఈ దళం తీరప్రాంతం పోలీస్ ల సహాయంతో తాబేలు కంటికి రెప్పలా కాపాడుతారు. ఇందుకుగాను అమెరికాలోని ఎక్స్‌ప్లోర్‌ క్లబ్‌ ప్రపంచాన్ని మారుస్తున్న 50 మందిలో సుప్రజ పేరు చేర్చింది తత్వశాస్త్రంలో పీహెచ్‌డీ చేశారు సుప్రజ.

Leave a comment