మిర్రర్ వర్క్ ఎప్పటికీ పాతబడని ఫ్యాషన్. ప్రత్యేక సందర్భాల్లో మెరిసిపోతూ కనిపించాలంటే మిర్రర్ వర్క్ చేసిన చీరెలతోనే సాధ్యం.సాధారణంగా మిర్రర్ బ్లౌజ్ ,ప్లెయిన్ చీరెతో ధరిస్తారు. కానీ అదే బ్లౌజ్ వర్క్ శారీపైన కూడా చాలా అందంగా ఉంటుంది. లెహంగాకు అందం తెచ్చిపెట్టేది కూడా మిర్రర్ వర్కే. చక్కని మెరిసే వస్త్రశ్రేణితో కుట్టించిన లెహంగాపై మిర్రర్ వర్క్ చేసిన బ్లౌజ్ చాలా అందంగా ఉంటుంది. బోట్ నెక్ ,ఓవరల్ నెక్ స్క్వేర్ నెక్ బ్లౌజ్లు అంచుల్లో అద్దాలు కుడితే ఎంతో బావుంటుంది. స్లీవ్ లెస్ బ్లౌజ్ కు డీప్ నెక్ తో చుట్టు అద్దాలు కుట్టిస్తే ఎంతో స్పెషల్ గా ఉంటుంది.

Leave a comment