లైన్ మేన్ ఉద్యోగానికి తెలంగాణ నుంచి తొలిసారిగా ఎంపికయింది బబ్బురి శిరీష ఆమెకి తెలంగాణ జిల్లా సిద్దిపేట జిల్లా గణేష్ పల్లి ఐ.టి.ఐ కోర్స్ చేసింది లైన్ మేన్ ఉద్యోగం కోసం TSSPDCL సంస్థ ఇచ్చిన నోటిఫికేషన్ కోసం ప్రయత్నం చేస్తే మహిళలకు అవకాశం లేదన్నారు. అప్పుడు కోర్టుకు వెళ్లింది శిరీష హైకోర్టు ఆదేశాలతో దరఖాస్తులు స్వీకరించారు. మహిళా అభ్యర్థులకు పోల్ టెస్ట్ చేసి ఉద్యోగం ఇవ్వాలనే హైకోర్టు ఆదేశంతో ఒకటిన్నర నిమిషం లో విద్యుత్ స్తంభం ఎక్కి దిగి జూనియర్ లైన్ ఉమెన్ గా ఎంపికయింది శిరీష. తెలంగాణ గవర్నర్ ఆమెను ట్విట్టర్ లో అభినందించారు .

Leave a comment