పోషక విలువలున్న ఆహారానికి కొన్ని రకాల గింజలు జతచేసి తీసుకుంటే శిరోజాలు పెరుగుతాయి అంటున్నారు నిపుణులు. నువ్వుల్లో పాలీ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఖనిజలవణాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజూ ఆహారంలో భాగంగా తీసుకుంటే జుట్టు కుదుళ్లు బలంగా అవుతాయి.పొద్దు తిరుగుడు విత్తనాలు లోని జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ విటమిన్-ఇ వంటివి శిరోజాలు పెరగటం లో తోడ్పడతాయి. అవిసె గింజల్లోని ఖనిజాలు శిరోజాలకు రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తాయి. రోజు ఒక స్పూన్ గుమ్మడి విత్తనాలు తీసుకుంటే వీటిలోని జింక్ ,సెలీనియం, మెగ్నీషియం, ఐరన్, క్యాల్షియం, కాపర్ ఏ, బి, సి విటమిన్లు కుదుళ్ల ను ఆరోగ్యంగా చేస్తాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే చియా గింజలు మాడును ఆరోగ్యంగా ఉంచుతాయి. మెంతుల లోని ప్రోటీన్లు జుట్టుకు ఆరోగ్యాన్నిస్తాయి.

Leave a comment