ఇండోనేషియా అత్యధికంగా ముస్లిమ్ జనాభా కలిగిన దేశం . దేశం అంతా ఇస్లామ్ స్వీకరించినా బాలీ ద్వీపంలో మటుకు హిందూ ద్వీపంగానే నిలిచింది . ఇక్కడ జల వనరుల వెంట ఎన్నో శైవ మందిరాలు ఉన్నాయి . ముఖ్యమైనది బ్రాటాన్ సరస్సు ఒడ్డున ఉన్నా ఉలున్ దాను మందిరం ఇది శివ మందిరం . 17 వ  శతాబ్దంలో నిర్మించారు . గోపురం ఎన్నో అంతస్తులుగా ఉంటుంది . దగ్గరలో బెడుగై పర్వతంలో పడిన నీరు ఈ శివమందిరం ఉన్నా బ్రాటాన్  సరస్సులోకి చేరితే ,అక్కడి అదనపు నీరు కింద నిర్మించిన సరస్సులు ,చెరువుల లోకి వెళతాయి . ఈ సరస్సు నేటికీ ఔషధ గుణాలు ఉన్నాయంటారు . ఈ సరస్సు జలాల వల్లే అక్కడ పంటలు సమృద్ధిగా పండుతాయి .

Leave a comment