ఆమె నాట్యం ,నటన ఎప్పుడూ ప్రత్యేకమే.ఎన్నేన్నో కొత్త ప్రయోగాలకు శోభన నృత్యం ఎప్పుటికప్పుడు ప్రేక్షకులకు సంతోషం ఇస్తూనే ఉంది. రుద్రవీణ ,రౌడీ అల్లుడు,రౌడీగారి పెళ్ళాం,అల్లుడుగారు,నారీ నారీ నడుమ మురారీ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల అభిమానం పొందిన ప్రముఖ హీరోయిన్ శోభనకు అరుదైన గౌరవం దక్కింది.ఎంజీఆర్ విద్యా పరిశోధన సంస్థ ఆమెకు గౌరవ డాక్టరేట్ ఇవ్వబోతుంది. విక్రం సారాభాయ్ స్పేస్ డైరెక్టర్ సోమ్ నాథ్, శోభన ,సంగీత దర్శకుడు హరీష్ జయరాజ్ లను గౌరవ డాక్టరేట్ లతో సత్కరిస్తారు .సినిమాలు తగ్గించినా ,నృతప్రదర్శనలు మాత్రం ఎప్పుడూ ఇస్తూనే ఉంది శోభన.

Leave a comment