ప్రపంచంలో అత్యంత ఖరీదైన షూ విడుదల చేశారు. ఈ పెయిర్ ధర 123 కోట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని బుర్జ్ ఆల్ అరబ్ హోటల్ వీటిని బంగారంతో విలువైన అద్భుతమైన వజ్రాలతో ఎంతో అందంగా తయారు చేశారు. జడా దుబాయ్ బ్రాండ్ ఫ్యాషన్ జువెలర్స్ తో కలిసి రూపోందించిన ఈ అముల్యమైన చెప్పుల జత తయారు చేసేందుకు 9 నెలలు పట్టిందట. ప్రపంచంలో ఉన్న ఒకే ఒక 7 స్టార్ హోటల్ బుర్జ్ ఆల్ అరబ్ లో ఈ ఖరీదైన చెప్పులను చూడవచ్చు. jada dubai కంపెనీ కో ఫౌండర్ క్రియేటివ్ డైరెక్టర్ మేరియా మజారీ మాట్లాడుతూ ఇంత అద్భుతమైన ఖరీదైన వజ్రాలతో రూపోందించిన ఈ షూస్ ప్రపంచంలో మా కంపెనీ మాత్రమే తయారు చేయగలదు.ఈ జతను ఎంతో పరెఫెక్ట్ గా నడిచేందుకు వీలుగా తయారు చేశారు. ఈ ఈవెంట్ లో వీటిని అమ్మేందుకు కాదు అన్నారామె.

Leave a comment