ఈ వేసవి చమటకు బూట్ల నుంచి దుర్వాసన రావచ్చు. వంటింట్లో అందుబాటులో ఉండే నిమ్మతొక్కలు,వంటసోడాతోనే ఈ సమస్య పొగొట్టవచ్చు. దుర్వాసనగా ఉన్న బూట్ల పైన రాత్రి వేళ కాస్త వంటసోడా చల్లి అలా వదిలేస్తే ఇది చమటను దుర్వాసనను పీల్చేస్తాయి. కాఫీ పొడి వంటసోడా పొట్లంకట్టి బూట్లలో ఉంచినా వాసన పోతుంది. నారింజ, నిమ్మ,బత్తాయి పండ్ల తొక్కలు బూట్లలో ఉంచిన వాసన పోతుంది. రెండు రోజులకోకసారి రాత్రి వేళ ఉప్పుజల్లి అలా వదిలేస్తే తెల్లవారే సరికి వాసన పోతుంది. ఉప్పు దులిపేస్తే పోతుంది. బూట్లలో తేమ లేకుండా కాగితపు ఉండల్ని ఉంచితే చాలు.

Leave a comment