ఇప్పటికే షాపింగ్ లో జరిగే జాప్యం పైన బోలెడన్ని జోక్స్ వచ్చాయి. మరి ఏ పెళ్ళిల్లో ,పేరంటాలో వస్తే బోలెడన్ని కొనాలి. కొనే వాళ్ళ సంగతి ఏమో గానీ తోడుగా వెళ్ళిన వాళ్ళ పనైపోతుంది. అలా షాపింగ్ మాల్స్ లో కొనే వాళ్ళని ఇక ముగించు,పోదాం అని విసిగించకుండా స్లీపింగ్ పాడ్ లాంజ్ లు ఏర్పాటవుతున్నాయి. దుబాయ్ లోని ఒక మాల్ లో 1200 దుకాణాలు ఉన్నాయి. ఈ భవనం పార్కింగ్ ఏరియాలో ఈ స్లీపింగ్ పాడ్ లాంజ్ ఏర్పాటు చేశారు. మంచి బెడ్ ,చార్జింగ్ పాయింట్,కంపార్ట్ మెంట్లుగా ఉన్న స్లీపింగ్ ఏరియాలో హాయిగా పడుకొని నిద్రపోవచ్చు. కాకసోతే గంటకు ఇంతని చార్జు చేస్తారు. ఈ సదుపాయం మనకు వస్తే మన బిగ్ మాల్స్ మూడు పువ్వులు ఆరు కాయాలుగా వృద్ధి చెందుతాయి.

Leave a comment