గ్రాసరీ షాపింగ్ కు వెళ్లే ముందర లిస్ట్ దూసుకువెళితే మంచిదా ? లేదా వెళ్లి వస్తువులు చెక్ చేసుకుంటూ కొనుక్కకోవటం బెటరా ? అని ప్రశ్నించుకుంటే రెండోదే బెటరంటున్నారు నిపుణులు. తీరి కూర్చుని లిస్ట్ రాసుకుంటూ పోతే ఏది కావాలో గుర్తుతెచ్చుకుంటూ రాస్తూ రకరకాల వస్తువులతో బోలెడంత జాబితా తయారవుతుంది. అదే షాప్ కు వెళ్లి వస్తువులను కళ్ళతో చూస్తూ ఎంతెంత అవసరమో చూసుకుంటూ కనుక్కుంటే మిగతా వాటితో పోల్చి చూస్తాం కనుక ఆరోగ్యవంతమైన వాటిని ఎంచుకునే అవకాశం ఉంటుంది. కానీ జాబితా రాసుకోకపోతే మర్చిపోతాం కదా అనుకునేందుకు సూపర్ మార్కెట్ చుట్టూ రింగ్స్ తిరుగుతాం కాబట్టి ఇంకా ఎక్కడో జ్ఞాపకం రానివి కూడా ఎదురుగ్గా కనపడతాయి. కాబట్టి లిస్ట్ మోసుకుంటూ కనుక్కోవటం సులభం . ఒకటి రెండు సార్లు ఇలా చెక్ చేసుకుని జాబితా గురించి నిర్ణయం తీసుకోమంటున్నారు ఎక్స్ పెర్ట్స్.

Leave a comment