మంచి ఆరోగ్యానికి షార్ట్ కట్స్ అనేవి ఏవీ ఉండవు. అందుకోసం కేవలం కష్టపడాలి. హెల్త్ ఫిట్ గా  ఉండే ఎక్సర్సైజు లు చేయాలి. పెరఫార్మేన్స్ మెరుగుదల కోసం ముందుగా స్నాక్స్ తినాలి. ఏదీ తినకుండా వర్కవుట్స్ చేస్తే ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. ముందుగా ప్రతి వర్కవుట్ తర్వాత స్ట్రెచింగ్ చేస్తే శరీరం కూలవుతుంది. కూర్చునే ఉద్యోగాల చేసేవాళ్ళు ప్రతి 30 నిమిషాలకు బ్రేక్ తీసుకోవాలి. కొన్నిసార్లు టైట్ డెడ్ లైన్స్ వుంటే  అలారం గంటకోసారి ఫోన్ లో సెట్ చేస్తే వెంటనే లేచి తిరిగే అలవాటు అవుతుంది. ఇలా కొన్నాళ్ళు గంటకు సరి లేచి తిరిగే అలవాటు తో ఎనర్జీ స్థాయిలు  ఎంత పెరుగుతాయో ఆశ్చర్యం వేస్తుంది కదూ. క్రమం తప్పకుండా  ఎనిమిది గంటలు నిద్రపోవాలి. లేకపోతే  నిద్రలేమి ప్రభావం శరీరం పైన వుంటుంది. అప్పుడు ఎప్పుడు కుదిరితే అప్పుడో 20 నిముషాలు విశ్రాంతి తీసుకున్నా  నష్టమేం లేదు. శరీరం ఆ విశ్రాంతిని అర్ధం చేసుకోగలదు. బ్రేషింగ్ తర్వాత నోరంతా నీటిని నింపుకుని కుదుపుతూ  పుక్కలించటం చేస్తే నోటిలో  ఉన్న చెడు  బాక్టీరియా పోయి నోరు శుభ్రపడుతుంది. రాత్రి పడుకోవటానికి రెండు గంటల ముందే తినే ఆహరం ఎదో తినేయాలి. లేదా తిని తినగానే నడక చేరితే అదనపు క్యాలరీలు  చేరటం లేదా క్యాలరీలు కరిగాక పోవటం జరుగుతుంది. ఆరోగ్యం కోసం సమయం లేదనవద్దు. కేటాయించి తీరాలి అంతే.

Leave a comment