సౌందర్య సాధనాలు అన్నింటిలోనూ రసాయనాలు ఉంటాయి వీటిని కొనేముందు కవర్పై వివరాలు, గడువు తేదీ గమనించ మంటున్నారు ఎక్సపర్ట్స్. ముఖానికి ఒంటికి ఒకే విధమైన సబ్బు బాడీ లోషన్ లు వాడకూడదు. ముఖ చర్మానికి మిగతా శరీర చర్మానికి తేడా ఉంటుంది.ముఖ చర్మాన్ని రసాయనాలకు దూరంగా ఉంచాలి. పెసర పిండి లేదా శనగపిండి తో ముఖం శుభ్రం చేసుకుంటే అందంతో పాటు ఆరోగ్యంగా ఉంటుంది. మేకప్ కు ఉపయోగించే పౌడర్ పఫ్, బ్రష్,స్పాంజలను ఎప్పటికప్పుడు కడిగి పెట్టుకోవాలి. కనుబొమ్మలు తీర్చిదిద్దుకునే బ్రష్ శుభ్రం చేయాలి. కళ్ళకు వాడే మస్కారా సాధ్యమైనంత చిన్నది తీసుకోవాలి. గడువు తేదీ అయ్యే లోపల దాని పూర్తి చేయచ్చు.

Leave a comment