శివుడాఙ్ఙ లేనిదే చీమైనా కుట్టదని…మనందరికీ తెలుసు. మరి ఆలస్యం చేయకుండా శంషాబాద్ దగ్గరలో సిద్దులగుట్ట
లో స్వయంభువుగా వెలసిన సిద్ధేశ్వరుణ్ణి దర్శనం చేసుకుని వద్దాం పదండి. ఇక్కడ వాతావరణం సహజసిద్ధమైన సౌందర్యంతో ఆలయం చుట్టూ తెల్లటి కొండలలో స్వామి పూజలు అందుకుంటున్నాడు.అందుకే ఈ క్షేత్రానికి వెండి కొండ సిద్ధేశ్వరాలయం అని చరిత్ర చెబుతోంది.ఈ ప్రాంతంలో అనేక మంది సిధ్ధులు తపస్సు చేసే వారని దాని విశిష్టతే సిద్ధేశ్వరం అని భక్తులు నమ్మకం. స్వామి వారికి ప్రతి సోమవారం నాడు భక్తులు స్వయంగా అభిషేకాలు చేసుకుని తరిస్తారు.భక్తుల కోర్కెలు తీర్చే స్వరూపుడుగా మనకు దర్శనం ఇస్తారు.

నిత్య ప్రసాదం:  కొబ్బరి, పండ్లు, ఆవు పాలతో అభిషేకం.

   -తోలేటి వెంకట శిరీష

Leave a comment