కొన్ని రకాల ఫేస్ మాస్క్ లు మొహాన్ని మెరిపిస్తాయి..మీగడ బ్లూబెర్రీస్ తో ఇంట్లోనే చేసుకునే ఈ ప్యాక్ చర్మాన్నిఆరోగ్యంగా ఉంచుతుంది. రెండు బ్లూబెర్రీ లు ఒక స్పూన్ తాజా మీగడ అర టీస్పూను ముల్తానీ మట్టి తో ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. బ్లూ బెర్రీలు మెత్తగా చేసి అందులో మీగడ వేసి కలిపి పేస్టులా చేయాలి. ఇందులో ముల్తానీ మట్టి కలిపి చిక్కగా తయారు చేసుకుంటే ప్యాక్ సిద్ధం. ముందుగా ముఖానికి ఆవిరి పట్టుకొని శుభ్రంగా ముఖం తుడుచుకుని ఆ ప్యాక్ ను అప్లయ్ చేయాలి తర్వాత మెల్లగా మసాజ్ చేయాలి. మీగడ లో ఉన్న ప్యాట్స్ తో ముఖ చర్మం శుభ్రంగా అయిపోయి మెరుస్తుంది. చర్మం పైన ముడతలు రావు మొటిమలు నివారణకు కూడా ఈ ప్యాక్ ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది .

Leave a comment