కొచ్చి నుంచి కాశ్మీర్ వరకు 17 వేల కిలోమీటర్లు కారులో ప్రయాణం చేశారు డాక్టర్ మిత్రా సతీష్. కొచ్చి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో ప్రొఫెసర్ గా పని చేస్తున్న డాక్టర్ మిత్ర 10 ఏళ్ళ కొడుకు నారాయణ్ తో పాటు చేసిన ఈ ప్రయాణంలో 28 రాష్ట్రాలు, ఆరు కేంద్ర పాలిత ప్రాంతాలు కవర్ చేశారు జమ్మూ, ఉత్తరాఖండ్, డెహ్రాడూన్, జైపూర్, ఉజ్జయిన్, గుజరాత్, మహారాష్ట్ర, గోవా మీదుగా కేరళ చేరుకున్నారు. ఈ ప్రపంచంలో భౌగోళిక  చారిత్రక నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ప్రత్యేకమైన భారతాన్ని స్వయంగా చూసేందుకు డాక్టర్ మిత్ర టూర్ ప్లాన్ చేసుకున్నానంటున్నారు. పిల్లలతో కలిసి ఇలాంటి టూర్ లు చెయ్యటం కొత్తగా ప్రపంచాన్ని పరిచయం చేసుకోవడం చాలా అవసరం అంటున్నారు డాక్టర్ మిత్రా.

Leave a comment