పొడుగ్గా వుంటే పదిమందితో ప్రత్యేకంగా కనిపిస్తూ, అసలా పొడుగే గొప్ప అందం అనిపిస్తుంది. కానీ ఆ అందానికి కాస్త ఫ్యాషన్ జోడిస్తే మరికాస్త అందం సమకురినట్లే. ఎత్తుగా ఉన్నాం కదా అని మరి కాస్త అందం సమకురినట్లే.ఎత్తుగా వున్నాం కదా అని మరీ వేలికి కరుచుకునేలాగా ఫ్లిఫ్ ప్లాప్స్ ని వేసుకుంటారు. కానీ ఏ మాత్రం ఎత్తు లేకుండా ఈ చెప్పులు ఏమీ అందం ఇవ్వవు. ఎత్తు లేని అందమైన కట్ షూస్ గానీ కాన్వాస్ షూస్ ని గానీ ప్రయత్నం చేయవచ్చు. అలాగే పొడుగ్గా వుండే వాళ్ళకి వదులుగా వుండే బ్యాగీ దుస్తులు ఏమత్రం బావుండవు. అలాగని ఒంటికి అతుక్కునే తరహ డ్రెస్సులు అస్సలు వేసుకోకూడదు. సరిగ్గా సరిపోయే దుస్తులు ధరించాలి. ఎక్కువ నగలు ఎవ్వరికి బావుండవు. ఒక్క గొలుసు ఎంతో అందం ఇస్తుంది. అలాగే మ్యాచ్ అయ్యే పెద్ద హ్యాండ్ బాగ్ ఎంచుకోవాలి. ధరించిన నగలు, షూస్ అన్నీ మాచింగ్ గా వున్నా ఎబ్బెట్టుగా వుండవు.

Leave a comment