దయచేసి ఆహారాన్ని వృధా చేయకండి.దేశంలో ఎంతో మంది ఆకలితో అలమటిస్తూ ఉన్నారు అంటూ ట్విట్టర్లో ఓ సందేశం పోస్ట్ చేసింది గాయని స్మిత. హాయ్ రబ్బా స్మితగా తెలుగు వాళ్లకు పరిచయం అయిన స్మిత భర్త కూతురుతో హైదరాబాద్ లో ఉంటుంది .కరోనా  వేళ ఆమె రోజుకు 2,500 మందికి భోజనం పెట్టాలి అనే కార్యక్రమం నిర్ణయించుకుంది.ఇప్పుడా సాయం ఐదువేల మందికి అందుతోంది .రెండు వేల మంది పేద కుటుంబీకులకు పది రోజులకు సరిపడా రేషన్ సరుకులు ఇచ్చింది స్మిత .సాయం చేయాలనుకుంటే ముందు మంచి మనసు ఉండాలి అని స్మిత నిరూపించింది.

Leave a comment