అనుష్కా శెట్టి అనగానే మనకెన్నో ప్రయోగాలు గుర్తొస్తాయి. అరుంధతి, పంచాక్షరి, వేదం, బాహుబలి, రుద్రమ్మదేవి.. ఏదైనా ఒక్క సినిమా ఒక సాహసం . ఇక సైజ్ జీరో అయితే ఏ నటి చేయని సాహసం. దక్షినాది ప్రజల అభిమానం పొందే యాభై మంది మహిళల్లో అనుష్క పేరు వుండాలిసిందే. నగలంటే ఏ మాత్రం ఇష్టం లేని అనుష్క, అరుంధతి సినిమాలో 12 కేజీ ల బరువైన నగలు ధరించింది. ఇక నగలు ఆమెకి నచ్చడం మొదలైంది. బైక్ రైడింగ్ అంటే అనుష్కకి ఎంతో ఇష్టం. ఇప్పటి వరకు ఒక్క వ్యాపార ప్రకటలో కూడా నాటించ లేదు. బాలీవుడ్ సినిమా అవకాశాలు వచ్చినా ఒప్పుకోలేదు. ఏనుగు, గుర్రం స్వారీలు సినిమాల కోసమే నేర్చుకుంది. బ్రెజిల్ రచయిత పాల్ కొయిలో నవల ఆల్ కెమిస్ట్ అంటే ఆమెకి చాలా ఇష్టం. చికెన్ అంటే చాలా ఇష్టం, నలుపు రంగు దుస్తులు ఇష్టం, అత్యధిక పారితోషకం తీసుకునే జాబితాలో అనుష్క వుంది. కధానాయిక గా స్థిర పడక ముందు యోగా శిక్షకురాలిగా పని చేసింది. ఈమె సామాన్య మైన యువతి. సినిమా వృత్తిలో రాణించడం కోసం తనను తానూ తీర్చి దిద్దుకుంది. అనుష్క పరిచయం చదివాక ఏ అమ్మాయైనా ఒక కొత్త పని నేర్చుకోవడం మొదలుపెడితే బావుండు.
Categories
Gagana

సినిమా గురించి ఎన్ని నేర్చిందో ఈమె

Leave a comment