కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించారు ‘సర్’ సినిమా అశ్విన్ సోదరుడి మరణంతో తల్లిదండ్రులకు సపోర్టు గా ఉండేందుకు అమెరికా నుంచి వస్తాడు. రత్న ఆ ఇంట్లో పనిమనిషి అశ్విన్ భార్య ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. తల్లి నియమించిన రత్న అతనికి ఎంతో ఆదర్శంగా సేవ చేస్తోంది. ఒక సమయంలో అశ్విన్ రత్నాను ప్రేమించానని చెబుతాడు. కానీ రత్న 18 సంవత్సరాలకే భర్తను పోగొట్టుకొని అత్తగారింటి అనుమతితోనే ముంబై కి వచ్చి పని చేసుకుంటున్నానని సంపాదించిన డబ్బు అత్త ఇంటి కి కొంత చెల్లెలు చదువుకు కొంత ఉపయోగిస్తున్నానని తనకు ఈ బాంధవ్యం ఇష్టం లేదంటుంది. మనసులో అశ్విన్ పైన పైన ఎంతో ప్రేమ ఉన్నప్పటికీ అతని కుటుంబానికి తల్లి కి దూరం చేసే ఈ ప్రేమ నుంచి దూరంగా ఉండమని కోరుతుంది. ఆమె కోరుకున్న ఫ్యాషన్ డిజైనింగ్ ఉద్యోగం ఆమెకు సంపాదించి పెట్టి అశ్విన్ అమెరికా వెళ్ళి పోతాడు. ఒక మనిషి గౌరవాన్ని ఎంతబాగా నిర్వహించారు ఈ సినిమా చాలా బాగుంది నెట్ ఫ్లిక్స్ లో ఉంది.

రవిచంద్ర.సి
7093440630

Leave a comment