Categories
శిరోజాలు ప్రోటీన్లతో తయారైనవి కాబట్టి వాటి ఎదుగుదలకు ప్రోటీన్లు కావాలి. దైనందిక ఆహారంలో ప్రోటీన్లు భాగంగా ఉండే శిరోజాల ఆరోగ్యం బావుంటుంది. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్లు ఎ,సి, ఇ, కె,విటమిన్లు పాస్సరస్ ,పోటాషియం ,కాల్షియం ,మెగ్నిషియం వంటి యాంతటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి శిరోజాల ఆరోగ్యం కపాడుతాయి. సుగంధ ద్రవ్యమైన జాజి కాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని టాక్సిన్ లను వెలికితీసి నెట్టేయటంతో పాటు శిరోజాలను కండిషన్ చేస్తాయి.తేనె లో ఉండే ఐరన్ ,కాల్షియం ,పోటాషియం,బి,సి ఎమినొ యాసిడ్స్ వంటి విలువైన విటమిన్లు ఖనిజాలు జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అలాగే అవకాడో ,బనానా,క్యారెట్, డ్రైడేట్స్ శిరోజాల ఆరోగ్యాన్ని రక్షించేస్తాయి.