భారతదేశంలో కేశ సంరక్షణ వ్యాపారం 2020 వ సంవత్సరం లో 25 వేల కోట్లకు పైమాటే అని ఒక అంచనా. విలువైన బంగారం వజ్రాలు వంటివి స్మగ్లింగ్ చేయటం మామూలే. కానీ కత్తిరించాక తుడిచి పారేసే జుట్టు కూడా మన దేశం నుంచి గుట్టలు గుట్టలుగా విదేశాలకు తరలి పోతోంది. హైదరాబాద్, గుంటూరు ప్రాంతాల్లో చైనాకు అక్రమంగా తరలించేందుకు గానూ సిద్ధంగా ఉన్న జుట్టును కొన్ని వారాల క్రితమే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జుట్టు తో విగ్గులు, సవరాలే కాదు, దుస్తుల తయారీలో, కళాకృతుల తయారీలో, ఫర్నిచర్ తయారీలో, బేకరీ ఉత్పత్తుల్లో, ఎరువుల తయారీలో ఇట్లా ఎన్నో రకాలుగా ఉపయోగిస్తున్నారు. జుట్టు నుంచి వేరు చేసిన ప్రోటీన్ లను ఔషధ తయారీలో ఉపయోగిస్తున్నారు. జుట్టుకు విలువ ఎప్పుడు అపూర్వమే !

Leave a comment