Categories
సిమ్రత్ కతురియా అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రకరకాల గింజలతో తయారు చేసిన స్మూధీ లక్షల మంది ఇష్టపడ్డారు.రెండు స్పూన్ల అవిసె గింజలు, రెండు స్పూన్ల వేయించిన పొద్దు తిరుగుడు గింజలు, రెండు స్పూన్ల గుమ్మడి గింజలు, రెండు స్పూన్ల తామర గింజలు, మూడు ఖర్జూరాలు కలిపి గ్రైండర్ లో మెత్తగా పొడి చేసుకుని డబ్బాలో దాచుకోవాలి.ఈ పొడిలో రోజు రెండు ఖర్జూరాలు రెండు బాదం పప్పులు కలిపి నీళ్లు పోసి బ్లెండ్ చేసి వారానికి రెండు మూడు సార్లు తాగితే జుట్టు కుదుళ్ళు గట్టిగా ఉంటాయని జుట్టు ఊడిపోదని చెబుతున్నారామె.