తన స్టార్టప్ ద్వారా మునగ ఆకు ములక్కాడల తో వివిధ రకాల ఆహార ఉత్పత్తులు బ్యూటీ ప్రొడక్ట్స్ తయారు చేసే విక్రయిస్తూ తనతో పాటు రైతులకు ఉపాధి కల్పిస్తోంది దీపిక రవి. తమిళనాడులోని కరూర్ జిల్లా కరూర్ గ్రామంలో పుట్టి పెరిగి 26 ఏళ్ల దీపిక రవి మొరింగా ను సూపర్ ఫుడ్ గా గుర్తించి 2017 లో మునగాకుతో రెండు రకాల పొడులు తయారు చేసి విక్రయించటం మొదలు పెట్టింది తర్వాత ది గుడ్ లీఫ్ పేరుతో స్టార్టప్ ప్రారంభించింది. మునగ క్యాప్సిల్స్, చెట్నీ పొడి, మసాలా టీ, ఫేస్ స్క్రబ్స్, హెయిర్ ఆయిల్,హెయిర్‌సిరమ్‌ కూడా తయారుచేసి విక్రయిస్తోంది. సేంద్రియ పద్ధతిలో పండించిన ఉత్పత్తులను తయారు చేయడం వల్ల గుడ్ లీఫ్ కు కస్టమర్ల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.

Leave a comment