కూర్చుని గంటల కొద్ది పని చేస్తుంటే మెడ నొప్పి, నడుము నొప్పి శాశ్వతం కావచ్చు అంటారు ఎక్స్ పర్ట్స్ . కూర్చునే సీటు సౌకర్యంగా ఉండాలి. ఎత్తు సరిగ్గా ఉండాలి. పాదాలు నేలపై ఆనాలి కుర్చీకి తప్పనిసరిగా బ్యాక్ రెస్ట్ ఉండాలి. మానిటర్ 16 నుంచి 30 అంగుళాల దూరంలో ఉండాలి. స్క్రీన్ పై భాగం కంటి ఎత్తులో ఉండాలి. ప్రతి గంటకు బ్రేక్ తీసుకోవాలి. గంటకోసారి లేచి రెండు నిమిషాలు నడవాలి. కాళ్లకు సంబంధించిన వ్యాయామాలు చెయ్యాలి. కూర్చొనే భంగిమ సరిగ్గా ఉండాలి. శరీరంలో కదలికలు ఉంటే కీళ్లలో స్టిఫ్ నెస్ రాకుండా ఉంటుంది. ప్రతి ఉదయం వ్యాయామం చేస్తేనే ఫిట్ గా ఉంటారు. ఫిట్ గా ఉంటేనే ఎనిమిది గంటల పాటు ఉద్యోగం చేయగలుగుతారు.

Leave a comment