గోల్డెన్ మిల్క్ తగైతే అది యాంటీ ఆక్సిడెంట్ గా బ్రహ్మాండంగా పనిచేతుందని ప్రాచీన ఆయుర్వేద విజాననఁ చెప్పిందనీ నవీన యుగం దాన్ని తుచా తప్పకుండ ఆచరిస్తా నంటోంది. మరి గోల్డెన్ మిల్క్ తయారీ ఎలాగా అంటే వేడి పాలలో అర స్పూన్ పసుపు వేయటం అది చక్కగా బంగారపు రంగు పాలయిపోతుంది. ఇప్పుడీ అలవాటు ప్రపంచవ్యాప్తంగా మారుతోంది. పాలతో పాటు దాల్చిన చెక్క మిరియాలు శొంఠి వంటివి జత చేసి పంచదార లేకుండా తాగితే ఆరోగ్యం మహత్తరంగా ఉంటుందని అందరు అంగీకరిస్తున్నారు. కాఫీ టీ  చాక్లేట్ వంటి పానీయాల బదులు ఈ గోల్డెన్ మిల్క్ తగైతే వాపులు తగ్గిస్తుందని కాన్సర్ రాకుండా చేస్తుందనీ చెపుతున్నారు. పాలల్లోని పసుపు మనలోని హ్యాపీనెస్ హార్మోన్ అయిన సెరటోనియన్ ఉత్తేజితం చేసి జీర్ణవ్యవస్థను బాగుచేస్తుంది. శరీరంలోని విషతుల్యాలు బయటకి పోతాయి . పసుపు మిరియాలు కలిపి ముద్దగా నూరి కొబ్బరిపాలు లేదా సొయా పాలు లేదా బాదం పాలు కలపాలి. ఒక చుక్క కొబ్బరినూనె లేదా ఆలివ్ ఆయిల్ వేయాలి. పంచదార వేయకుండా రుచికోసం తేనె  దాల్చిన చెక్క చేర్చాలి. వేడివేడిగా తాగితే  ఈ శీతాకాలపు దివ్యౌషధం ఇదే అవుతుంది.

Leave a comment