ఆరేళ్ల బ్రిడ్జర్ వాకర్ కు వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్ ఆననరీ వరల్డ్ ఛాంపియన్ టైటిల్ ను ప్రకటించింది.యు ఎస్ లోని హ్యామింగ్ లో ఉండే బ్రిడ్జర్ చెల్లి తో కలిసి బయట ఆడుకుంటూ ఉంటే ఒక వీధి కుక్క వారిద్దరిపై దాడి చేసింది కుక్క చెల్లి ని కరవకుండా బ్రిడ్జర్ చాలాసేపు అడ్డంగా నిలిచాడు.కుక్క అతని ఎడమ చెంప ఊడి వచ్చేలా కొరికింది.ఎడమ దవడ ను రక్కేసింది.కన్ను గాయమై ఉబ్బి పోయింది.ఈ గాయాలకు కుట్లు వేసేందుకు రెండు గంటలు పడ్డాయి మొత్తం 99 కుట్లు వేశారు.పోనీ పారి పోక పోయావా అన్నాడు తండ్రి.మా ఇద్దరిలో ఎవరో ఒకరిని ఆ కుక్క చంపేస్తుంది ఆ చనిపోయేది నేనే కావాలనుకున్నాను అన్నాడీ వీరుడు.ఈ మాటలని, ఆ అన్నాచెల్లెళ్ల ను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది వాకర్ అత్త.ఈ రక్తం జాడతో గాయాలతో ఉన్న బ్రిడ్జర్ బాక్సింగ్ కౌన్సిల్ గౌరవించింది.
Categories