కరోనా సమయంలో రోగ నిరోధక శక్తి పెరిగేందుకు ప్రతిరోజు బొప్పాయి తింటూ ఉంటారు.బొప్పాయి పండు తోలు చర్మానికి ఎంతో మంచి చేస్తుంది. ఈ తోలు లో ఉండే ఎంజైమ్లు చర్మానికి రక్షణ ఇస్తాయి వయసు రీత్యా వచ్చే మచ్చలను తొలగిస్తాయి.ముఖం శుభ్రంగా కడిగేసి ఈ బొప్పాయి తోలుతో చర్మాన్ని రుద్దుకోవాలి. కళ్ళ చుట్టూ,కణతల పైన,మూతి చుట్టూ గల పైన లైన్స్ పై కూడా బొప్పాయి తోలుతో మెల్లగా రుద్దాలి అలాగే మెడ మోచేతులు కూడా పట్టించి పావుగంట తర్వాత కడిగేసుకోవాలి ఇలా ప్రతి రోజూ చేస్తే చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది తాజా యవ్వనంగా కనిపిస్తుంది.బొప్పాయి గుజ్జుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే కూడా చర్మం మెరిసిపోతుంది.

Leave a comment