ఒత్తిడి అలసట తగ్గాలన్న. అందాన్ని కాపాడుకోవాలి అనుకున్న ఒంటికి తలకు నూనె మసాజ్ చేసుకోవాలి అంటున్నారు ఎక్స్పర్ట్స్.మసాజ్ తో చర్మానికి తేమ అంది నిగారింపుగా ఉంటుంది. ఎండకు కమిలిన దేహం రంగు మారిన చర్మం సాధారణ స్థితికి వస్తాయి.కండరాల నొప్పులు తగ్గుతాయి.ఆలీవ్ నూనె తలకు పట్టించి మర్దనా చేస్తే తలభారం తగ్గుతుంది.అలాగే కొబ్బరి నూనెలో విటమిన్-ఇ గుణాలు ఎక్కువ.దాన్ని వేడి చేసి ఒంటికి రాసి మృదువుగా కాసేపు మర్దన చేస్తే పొడిబారిన చర్మం సాధారణ స్థితికి వస్తుంది.ఈ నూనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ ఫంగల్ లక్షణాలు వల్ల చర్మ సంబంధిత సమస్యలు రావు వయసు పైబడటం వల్ల వచ్చే ముడతలు కూడా రావు జుట్టుకు ప్రతిరోజు కొబ్బరి నూనె రాస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

Leave a comment