దానిమ్మ గింజల్లో అధిక మోతాదులో ఫ్లవనాయిడ్స్ పునిసిన్ యాసిడ్ ఉంటాయి. ఇవి చర్మాన్ని శుభ్రపరచటంలో కీలకంగా పనిచేసి ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ గింజల నుంచి తీసిన నూనెలో చెంచా తేనె కలిపి రోజు ఉదయాన్నే రాసుకొని పావు గంట పాటు ఇంక నివ్వాలి ఆపై కడిగేసుకొంటే చాలు చర్మం మెరిసిపోతుంది. దానిమ్మరసం స్కిన్ టోనర్ గా పనిచేస్తుంది. ముఖం శుభ్రంగా కడుక్కొని ఈ రసంలో కొద్దిగా యాపిల్ సిడార్ వెనిగర్ కలిపి రాస్తే అది చర్మం లోకి ఇంకి మెరుపుని తెచ్చి పెడుతోంది అలాగే ముల్తానీ మట్టి లో దానిమ్మ రసం కలిపి ఆ పేస్ట్ తో ప్యాక్ వేసుకొంటే చర్మం తాజాగా మెరిసిపోతుంది.

Leave a comment