చర్మానికి స్వాంతన ఇచ్చేందుకు మచ్చలు పోగ్గోటెందుకు సిల్క్ పౌడర్ వాడవచ్చు అంటారు ఎక్స్పర్ట్స్ .సిల్క్ పౌడర్ ను నాణ్యమైన పట్టు నుంచి తయారు చేస్తారు.ఇందులో చర్మానికి మేలు చేసే  పై బ్రయిన్ ప్రోటీన్ ఉంటుంది. ఖరీదైన మేకప్ ఉత్పత్తుల్లో వాడే ఈ సిల్క్  పౌడర్ చర్మాన్ని బిగుతుగా యవ్వనంగా ఉంచుతుంది. ఈ పౌడర్ ఉన్న సౌందర్య సాధనాలను వాడటం వల్ల చర్మం సాగే గుణం పెరుగుతుంది.దీనితో కళ్ళ చుట్టూ నోటి చుట్టూ ఏర్పడే గీతలు తగ్గిపోతాయి.కొందరిలో స్కిన్ ఇన్ ఫ్లమేషన్  సమస్య ఉంటుంది. సిల్క్ పౌడర్ లోని ప్రోటీన్ ఇన్ ఫ్లమేషన్ ను తగ్గించి చర్మాన్ని స్వాంతన పరుస్తుంది.మొహం పైన ఏర్పడే లేత రంగు మచ్చలను పోగొడుతుంది. ఇది అన్నిరకాల చర్మానికి సరిపోతుంది ఎలాంటి హాని చెయ్యదు.

Leave a comment