Categories
ఉదయం వేళ నిద్ర లేచేందుకు అలారం ఎంత అవసరమో నిద్రకు ఉపక్రమించేందుకు కూడా అలాగే అలారం అవసరం అంటున్నారు నిపుణులు. నిద్రించాలి అనుకొన్న సమయానికి గంట అరగంట ముందుగా అలారం సెట్ చేసుకోవాలి లేదా మొబైల్ నోటిఫికేషన్ పెట్టుకోవాలి. ఈ వ్యవధిలో గాడ్జెట్ల కాలక్షేపము ముగించాలి. నిద్రపోయే ముందర స్నానం చేయడం వల్ల మంచి నిద్ర పడుతుంది. పగలు వ్యాయామం చేసే అలవాటు చేసుకుంటేనే రాత్రి వేళ నిద్ర వస్తుంది. ఎడతెగని ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి చేస్తూ నిద్రకు భంగం కలిగిస్తే లేచి వాటిని ఓ పేపర్ పైన రాయమంటున్నారు నిపుణులు. అప్పుడు ఆందోళన తగ్గి మానసిక స్థితి మెరుగ్గా ఉంటుంది.