మొహాంపైన పడే  స్లీప్ లైన్స్ వల్ల వయసుకంటే ఎక్కువ కనబడుతారని చెపుతున్నారు ఎక్స్ పర్ట్స్. ఒకే వైపునే పడుకొనే అలవాటుంటే, అలా ఒక వైపే ఏళ్ళతరబడి పడుకొంటూ ఉంటే ఏ జింగ్ ప్రియలో భాగంగా కొంత వదులైన ముఖచర్మం తలగడకు బరుసుకు పోయి గీతలు పడుతాయి. వీటినే స్లీప్ లైన్స్ అంటారు . ఇలా జరగకుండా తలగడపైన తలను జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎప్పుడూ ముఖాన్నీ ఒకే వైపు తిప్పి పడుకొకూడదు. ఇప్పటికే అలవాటు ఉంటే నెమ్మదిగా అటు ఇటు మారుస్తు పడుకొవాలి. మోకాళ్ళ కింద ఒక తలగడ ఉంచితే వెన్నెముక సరైన పోశ్చర్ తో ఉండి పక్కకు తిరిగి పోకుండా ఉంటారు. కాళ్ళు కాస్త దూరంగా పెట్టుకొని పడుకొంటే ఒక పక్కకి తిరిగి పోకుండా ఉండవచ్చు.

Leave a comment