కరోనా జీవన శైలి లో ఎన్నో మార్పులు తీసుకొచ్చినట్లే. ఆఫీస్ కు వెళ్ళే అవకాశం లేక వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతి వచ్చింది. అలా ఇంట్లోంచి పని చేస్తున్న వారి పై చేసిన ఒక అధ్యయనం లో ఆలస్యంగా నిద్ర పోతున్న వారి సంఖ్య లో 40 శాతం పెరుగుదల నమోదైంది. 67 శాతం ఉద్యోగుల్లో నిద్రవేళలు మారి పోయాయి. లాక్ డౌన్ నుంచి చాలా మంది 11 గంటల తర్వాతే నిద్రకు ఉపక్రమిస్తూ ఉన్నారు. అంతకు ముందు వారిలో 41 శాతం రాత్రి 11 కంటే ముందే నిద్ర పోయేవారు. రాత్రి 12 గంటల తర్వాత నిద్ర పోయే వారి సంఖ్య 25 నుంచి 35 కు పెరిగింది. ఉద్యోగ భద్రత ,ఆర్ధిక నిర్వహణ,కుటుంబ భద్రత గురించిన భయాందోళన లో కొందరు ఉద్యోగుల్లో నిద్ర లేని రాత్రిలకు కారణమవుతున్నాయి.

Leave a comment