ఐ లైనర్ లో భిన్నమైన రంగులు ఎంచుకుంటే ప్రత్యేక సందర్భాల్లో మెరిసి పోవచ్చు అంటారు ఎక్సపర్ట్స్.రంగుల ఐ లైనర్ ఉపయోగించే ముందర కన్సీలర్ రాసుకోవాలి. ఇది కళ్ల దగ్గర చర్మం ఓకే  రంగులో ఉండేలా చేస్తుంది. బ్లాక్ ఐ లైనర్ మరి నియాన్  గ్రీన్ బావుంటుంది.అలాగే బంగారు వర్ణపు ఐ లైనర్ కూడా కొత్త లుక్ ఇస్తుంది. కలర్ లిక్విడ్ ఐ లైనర్ అందుబాటులో లేకపోతే సన్నటి బ్రష్ పైన మేకప్ సెట్టింగ్ స్ప్రే చల్లాలి. దాన్ని నచ్చిన రంగు ఐ షాడో లో ముంచి  కళ్ళను  అలంకరించుకోవచ్చు. ప్రత్యేక సందర్భాల్లో ఈ రంగుల ఐ లైనర్ తో విభిన్నంగా కనిపించేలా చేయవచ్చు.

Leave a comment