హాయిగా నిద్రపోతే చక్కగా బరువు తగ్గిపోతారు అంటున్నారు పరిశోధకులు. లీడ్స్ ఇన్ స్టిట్యుట్ ఆఫ్  కార్డియో వస్క్యులర్ అండ్ మెటబాలిక్ మెడిసన్ కు చెందిన పరిశోధకులు రెండు వేల మందికి పైగా చేసిన అధ్యాయినంలో ఈ సంగతి రుజువు చేసారు. తక్కువ నిద్రపోయే వాళ్ళ చాతీ వెడల్పుగా పెరిగింది. రోజుకి ఏడెనిమిది గంటలు నిద్రపోయే వాళ్ళతో పోలిస్తే ఆరు గంటలు నిద్ర పోయే వాళ్ళ చాతీ 1.2 అంగుళాలు ఎక్కువగా వుండటం బరువు కుడా త్వరత్వరగా పెరగడం గుర్తించారు. రోజుకి ఐదారు గంటల కన్నా తక్కువ నిద్రపొతే హార్మోన్ల అసమతుల్యత కారణంగా జీవక్రియ వేగం తగ్గడం, ఆహారం ఎక్కువగా తీసుకోవడం గమనించారు. బి.పీ, చక్కరా శాతం పెరిగింది కనుక ప్రశాంతంగా కొన్ని గంటలు హాయిగా నిద్ర పొతే చక్కగా సన్నగా ఉండొచ్చని ఊహిస్తున్నాయి అధ్యాయినాలు.

Leave a comment