సిఎన్ ఆర్ట్స్ మీనియేచర్స్ పేరుతో మట్టితో చేసిన మీనియేచర్ ఫుడ్ ఐటమ్స్ తయారుచేసి విక్రయిస్తారు చెన్నైకి చెందిన సుధా చంద్ర నారాయణన్ ఆమె కుమార్తె నేహా . సహజత్వం ఉట్టిపడేలా మట్టితో తయారుచేసిన ఈ బుల్లి ఆహారపదార్థాల బొమ్మలకు విదేశాల్లో కూడా మంచి ఆదరణ ఉంది.దక్షిణాది ఉత్తరాది వంటకాలతో సహా ఇటాలియన్ చైనీస్ వంటకాలు వందకుపైగా ఫుడ్ మీనియేచర్ లు తయారు చేయగలరు సుధా నేహా లు. ఈ మీనియేచర్ల లో ఉపయోగించే కూరగాయలు ధాన్యం గింజలు ఆవాలు కూడా మట్టి తో శ్రద్ధగా తయారుచేస్తారు. అర చేతిలో పట్టే ఈ పదార్థాలను మాగ్నేట్లా, కీ చైన్ లకు అతికించి ఇస్తారు కూడా.