కరోనా వైరస్ భయం తో శానిటైజర్ వాడి చేతులు శుభ్రం చేసుకొంటాం కానీ అస్తమానం చేతుల్లో ఉండే స్మార్ట్ ఫోన్ శుభ్రం చేయటం ఎలా  ? అసలు స్మార్ట్ ఫోన్ ఉపరితలం పై  ఎన్నో సూక్ష్మ జీవులు కొలువు దీరి ఉంటాయని వైద్య ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు .ఆ స్మార్ట్ ఫోన్ శుభ్రం చేసుకొనేందుకు సూపర్ స్మార్ట్ శానిటైజర్ వచ్చింది . ప్లాస్టిక్ గ్లాస్ లాగా కనిపించే ఈ శానిటైజర్ లో స్మార్ట్  ఫోన్ ఉంచి ఆన్ చేస్తే అందులోంచి అల్ట్రా వయోటెడ్ కిరణాలు వెలువడి ఆ స్మార్ట్ ఫోన్ పెయిన్ సూక్ష్మ జీవులను చంపేస్తుంది .అలాగే స్మార్ట్ ఫోన్ లకు వైర్ లెస్ ఛార్జర్ గా  ఉపయోగపడుతుంది .ఈ స్మార్ట్ ఫోన్ శానిటైజర్ ఖరీదు 6000 పైనే .

Leave a comment