వర్షాలు మొదలైతే ఇల్లంతా మూల మూల నా చల్లదనంతో ఏదో వాసన వస్తూ ఉంటుంది. ఇల్లు శుభ్రంగా లేదా అంటే అద్దం లా మెరుస్తూ ఉంటుంది. మరి వాసన ఎలా పోవాలి అంటే ఇంట్లో అందుబాటులో ఉండే వస్తువులను వాడటమే. దాల్చిన చెక్క ని ఓవెన్ లో బాగా వేడి చేయాలి.  పొగ వచ్చేంత బాగా వేడి చేసి దాన్ని ఇంటి మూలల్లో పెడితే ఆ వాసన పోతుంది. వంటసోడా లో నిమ్మరసం కలిపి దాన్ని చిన్న ప్లేట్స్ లో ఇంటి మూలల్లో పెడితే గదిలో ఉన్న దుర్వాసన పీల్చుకొని తాజా పరిమళం ఇస్తుంది. ఈ మిశ్రమం తో కార్పెట్లు సోఫా సెట్లు కూడా శుభ్రం చేయచ్చు. సూట్ కేస్, టేబుల్, డ్రా లు తీయగానే ఒకలాంటి వాసన వస్తాయి. వెనిగర్ లో చిన్నబ్రెడ్ ముక్కని నాననిచ్చి దాన్ని ప్లేట్ లో పెట్టి సూట్ కేస్ ల్లో డ్రాయర్ సొరుగు ల్లో ఉంచితే ఫ్రెష్ గా ఉంటాయి. అలాగే నేలపైన వెలికిపోయిన పాల వాసన, పెంపుడు జంతువులు మూత్రం వాసన పోవాలంటే బోరాక్స్ పౌడర్ ని చల్లి కాసేపయ్యాక క్లీన్ చేస్తే సరి. వంటగది సింకు ల్లో వేడినీటిలో బ్లీచింగ్ పౌడర్ కలిపి పోస్తే అడ్డుపడిన చెత్త చేరడం పోయి శుభ్రం అవుతాయి. బాత్ రూమ్స్ లో సిగరెట్ లైటర్ ను కొన్ని సెకండ్ల పాటు వెలిగిస్తే ఆ మంట ఆ ప్రాంతంలో ఉన్న వాసనలను పీల్చేస్తుంది. బొగ్గు ముక్క ఫ్రిడ్జ్ లో పెడితే రక రకాల వాసనలు పోతాయి. బొగ్గు కణిక పైన సాంబ్రాణి చల్లి సాయంత్రం వేళ ధూపం వేస్తే ఇల్లంతా చక్కని సువాసన వస్తుంది.

Leave a comment